ఆర్టీసీ పుణ్యక్షేత్ర దర్శిని కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుణ్య క్షేత్ర దర్శిని(యాత్రలు) పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన కర పత్రాలను ఎమ్మెల్యే బాలునాయక్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీ అందిస్తున్న ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.