నేడు నిత్యాన్నదాన కేంద్రాన్ని ప్రారంభించనున్న టీటీడీ ఛైర్మన్
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఆవరణలో టీటీడీ నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక నిత్య అన్నదాన ప్రసాద కేంద్రాన్ని నేడు TTD EO రవిచంద్ర, TTD JEO వీరబ్రహ్మంతో కలిసి TTD ఛైర్మన్ BR నాయుడు ప్రారంభించనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను కూడా వారు పరిశీలించనున్నారని పేర్కొన్నారు.