బాపట్లలో జిల్లా మలేరియా అధికారి ఆకస్మిక తనిఖీ

బాపట్లలో జిల్లా మలేరియా అధికారి ఆకస్మిక తనిఖీ

BPT: జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా మలేరియా అధికారి వీ. నాగార్జున రావు శుక్రవారం బాపట్ల పట్టణంలో పర్యటించారు. సంజయ్ గాంధీ కాలనీ, చంగల్ రాయుడు తోట సచివాలయ పరిధిలోని అరవపాలెం ఏరియాలో జరుగుతున్న 'ఫ్రైడే డ్రై డే' కార్యక్రమాలను ఆయన తనిఖీ చేశారు. నీటి నిల్వల్లో దోమల లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పట్టణ వాసులకు సూచించారు.