ప్రత్యేక క్యూఆర్ కోడ్ ప్రెస్ స్టిక్కర్ల ఆవిష్కరణ

ప్రత్యేక క్యూఆర్ కోడ్ ప్రెస్ స్టిక్కర్ల ఆవిష్కరణ

అన్నమయ్య జిల్లాలో నకిలీ విలేకరులను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ స్టిక్కర్లపై విలేఖరి అక్రిడిటేషన్ నెంబర్, వాహన నెంబర్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేరు, సంస్థ, హోదా, చిరునామా వంటి వివరాలు తెలుస్తాయి.