నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
కామారెడ్డిలో నకిలీ నోట్లు తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.1.70 లక్షలకుపైగా ఫేక్ నోట్లను స్వాధీనంచేసుకున్నట్లు తెలిపారు. గతంలో ఈ కేసులోనే దిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి 8 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.