జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
MBNR: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండల కేంద్రంలో 12.6 కనిష్ఠ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్ 12.9 డిగ్రీలు, దోనూర్ 13.3 డిగ్రీలు, కొత్తపల్లి, మిడ్జిల్ 13.4 డిగ్రీలు, సేరివెంకటాపూర్ 13.8 డిగ్రీలు, జడ్చర్ల 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.