'మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి'

'మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి'

ADB: ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను సీఐటీయూ అధ్యక్షుడు ఆశన్న కలిసి ఇవాళ వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని సీఐటీయూ అధ్యక్షుడు కోరారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు, ఉద్యోగ భద్రతతోపాటు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలన్నారు. సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.