యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న MP, MLA
ADB: 'మై భారత్' ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన యూనిటీ మార్చ్‌లో MP గోడం నగేష్, MLA పాయల్ శంకర్ బుధవారం పాల్గొన్నారు. దేశ ఐక్యత కోసం పటేల్ చేసిన కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ యూనిటీ మార్చ్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి రెవెన్యూ గార్డెన్స్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తదితరులు పాల్గొన్నారు.