ఆదిలాబాద్ చేరుకున్న కవిత
ADB: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సోమవారం పర్యటించారు. పట్టణానికి వచ్చిన ఆమెకు ఆదివాసీలు, మహిళలు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని కవిత పేర్కొన్నారు.