తర్లుపాడులో 12వ సర్వసభ సమావేశం

తర్లుపాడులో 12వ సర్వసభ సమావేశం

ప్రకాశం: తర్లుపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 12న సర్వసభ సమావేశం జరుగుతుందని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయ్యే సమావేశానికి అధికారులు తమ నివేదికలతో హాజరుకావాలని అలానే కార్యక్రమానికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరై తమ ప్రాంత సమస్యలను అధికారులకు విన్నవించాలన్నారు.