రైతులకు ముఖ్య గమనిక.. రేపు మార్కెట్ బంద్
WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు బంద్ ఉండనుంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు సోమవారం అధికారం తెలిపారు. కావున రైతులు తమ సరుకులను విక్రయించేందుకు మార్కెట్‌కు రావద్దని సూచించారు. తిరిగి బుధవారం మార్కెట్ ప్రారంభమవుతుందని, విషయాన్ని గమనించాలని కోరారు.