సిద్దారంపురం విద్యార్థులకు రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో అవకాశం

సిద్దారంపురం విద్యార్థులకు రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో అవకాశం

ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై కీర్తి సాధించారు. మంగళవారం హెచ్ఎం నీరజ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరిలో జరిగే అండర్-14 పోటీలకు బిందు, నందు, లక్ష్మి ఎంపిక కాగా, కడపలో జరిగే అండర్-17 పోటీలకు జగదీశ్వరి అర్హత సాధించారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని అభినందించారు.