ఓటు హక్కు వినియోగించుకున్న సర్పంచ్ అభ్యర్థి
MHBD: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధమని, ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రజల స్పందన చూస్తుంటే బీఆర్ఎస్ విజయం ఖాయమైందని ఆశాభావం వ్యక్తం చేశారు.