ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
KNR: మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప సర్పంచ్, BJP మాజీ మండల సభ్యులు రాపాక ప్రవీణ్ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అల్పాహారన్ని అందజేశారు. 1980 ఏప్రిల్ 6న ఏర్పడిన బీజేపీ అంచెలు అంచెలుగా ఎదుగుతూ సుస్థిర పాలన అందిస్తుందన్నారు.