VIDEO: సిలిండర్లతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు
VKB: తాండూరు పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ, సాంకేతిక లోపాల కారణంగా డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) నంబర్లు మొబైల్‌కు రాకపోవడంతో ఏజెన్సీలు సిలిండర్లు సరఫరా చేయడం లేదు. దీంతో సరైన సమయంలో గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.