సామెత.. దాని అర్థం

సామెత.. దాని అర్థం

సామెత: చెప్పుడు మాటలు నమ్మి చెడిపోకు
దాని అర్థం: ఒక విషయాన్ని స్వయంగా తెలుసుకోకుండా, మూడో వ్యక్తి చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల మనకు హాని జరుగుతుంది. కావున ఇతరులు చెప్పే అబద్ధాలను గుడ్డిగా నమ్మకూడదని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.