గోకులాష్టమి వేడుకల్లో పాల్గొన్న తుడా ఛైర్మన్

TPT: తిరుపతిలోని ఎస్వీ గోశాలలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకల్లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ మేరకు వీరికి గోశాల ఇంఛార్జ్ శ్రీనివాసులు, ఇతర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోవుకు పూజ చేసి హారతులు ఇచ్చి దాణా తినిపించారు. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.