ఘనంగా ప్రథమ వార్షికోత్సవం..

NLR: సంగం మండలంలోని దువ్వూరు గ్రామంలో ఆంజనేయస్వామి మొదటి వార్షికోత్సవం వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.