VIDEO: మండలంలో యూరియా కోసం రైతుల పాట్లు

VIDEO: మండలంలో యూరియా కోసం రైతుల పాట్లు

SRPT: పెన్ పహాడ్ మండలం చీదేళ్ళ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. శుక్రవారం ఉదయం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తరలివచ్చారు. కార్యాలయం ముందు రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్‌లో నిలబడి ఎదురుచూస్తున్నారు. వచ్చిన యూరియా పూర్తిస్థాయిలో రైతులందరికీ అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.