చంద్రుతండా పంచాయతీ పూర్తి ఏకగ్రీవం

చంద్రుతండా పంచాయతీ పూర్తి ఏకగ్రీవం

MHBD: కేసముద్రం మండలం వెంకటగిరి నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన చంద్రుతండా గ్రామ పంచాయతీ ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవమైంది. సర్పంచ్ పదవితో పాటు 8 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో పోటీ లేకుండా ఎన్నిక ఖరారైంది. బానోత్ శ్రీను సర్పంచ్‌గా, శోభ, రమేష్, లలిత, శ్రీను, బాలు, రజిత, సరిత వార్డు సభ్యులుగా ఏకగ్రీవమైనట్లు అధికారులు ఇవాళ తెలిపారు.