విషం తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య: రామసముద్రం మండలంలో కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన సురేఖ (26) అనే మహిళ బుధవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. గుట్టపల్లికి చెందిన ఆమె వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టిందన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న సురేఖను కుటుంబ సభ్యులు గుర్తించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.