'గీతన్నల రణభేరి బహిరంగ సభను జయప్రదం చేయండి'

'గీతన్నల రణభేరి బహిరంగ సభను జయప్రదం చేయండి'

సూర్యాపేటలో ఈ నెల 28న జరగనున్న కల్లు గీత కార్మిక సంఘం గీతన్నల రణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సయ్య, నరేష్, వెంకన్న కోరారు. ఆదివారం తుంగతుర్తి మండలం వెంపటిలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.