అప్రమత్తతతో తప్పిన ప్రమాదం ...!
SRPT: కోదాడ పట్టణంలోని 33 వ వార్డు సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ వస్తుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు సమాచారం తెలుసుకున్న వెంటనే వార్డు కౌన్సిలర్ యేసుపాదం విద్యుత్ శాఖ అధికారిని పిలిపించి ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న లోపాలను గుర్తించి మరమ్మతులు చేయించారు..