నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు
KDP: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 148 మందిపై కేసులు నమోదు చేసి రూ.38,840 జరిమానా విధించారు. వాహన చోదకులు విధిగా శిరస్త్రాణం ధరించాలన్నారు. మద్యంతాగి వాహనాలు నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.