మురుగు కాల్వలలో ప్లాస్టిక్ కవర్లు పడవేయవద్దు: మేయర్

మురుగు కాల్వలలో ప్లాస్టిక్ కవర్లు పడవేయవద్దు: మేయర్

KMM: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని నగర మేయర్ నీరజ కోరారు. ఇండోర్ పట్టణంలో పాటిస్తున్న పారిశుధ్య చర్యలను మన ఖమ్మం నగరంలో కూడా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. అటు మురుగు కాల్వలలో ప్లాస్టిక్ కవర్లు పడేయవద్దని అన్నారు. అటు ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.