16న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

16న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

AP: తిరుమలలో ఈనెల 16న టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజులపాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చించనున్నారు. అలాగే, టీటీడీ కొనుగోళ్లపై కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. జనవరి 25న నిర్వహించనున్న రథసప్తమికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు.