సోమందేపల్లిలో గుండెపోటుతో రైతు మృతి

సోమందేపల్లిలో గుండెపోటుతో రైతు మృతి

సత్యసాయి: సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు ఉప్పర లక్ష్మీనరసప్ప గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. రైతు ఉప్పర లక్ష్మీనరసప్ప ప్రతి రోజు కూలి పని చేసుకుంటూ తన కుటుంబ పోషణ చేసుకుంటూ జీవించేవారు. శనివారం ఉదయం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.