దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి: కలెక్టర్
MLG: దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి ప్రధాతలని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గిరిజన భవన్‌లో సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి దివ్యాంగులను కలుపుకునే సమాజాన్ని రూపొందించడం అనే నినాదంతో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులది అన్నారు.