'సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలి'
BDK: లక్ష్మీదేవి పల్లి మండలం సంజయ్ నగర్ గ్రామపంచాయతీ సీపీఐ పార్టీ బలపరిచిన కుంజా సుధాకర్ విజయాన్ని కాంక్షిస్తూ సీపీఐ పార్టీ చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి ఆధ్వర్యంలో గ్రామంలో ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ ఓటు అభ్యర్థించారు.