'సరఫరా చేసే మంచినీరు దుర్వాసన వస్తుంది'
GNTR: ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు కట్టలు తెగి ఆ మురుగునీరు తాగునీటిలో కలిసి పెదకాకాని పంచాయతీ సరఫరా చేసే మంచినీరు దుర్వాసన వస్తుందని సీపీఐ పొన్నూరు కార్యదర్శి సత్యనారాయణ విమర్శించారు. పెదకాకాని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల పెదకాకాని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని విమర్శించారు.