VIDEO: రహదారిపై ప్రమాదకరమైన పైప్ లైన్ల గాతులు
NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి నుంచి ఏమి రెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై తాగునీటి పైప్ లైన్ల పనుల కోసం గతంలో తవ్విన గాతులు ఇటీవల కురిసిన వర్షాలకు ప్రమాదకరంగా మారాయి. దీంతో రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్లపై ఏర్పడిన గుంతలకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.