గుర్తుతెలియని వాహనం ఢీకొని గేదె మృతి
అన్నమయ్య: రామాపురం మండలంలోని రామాపురం రైతు భరోసా కేంద్రం వద్ద శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని గేద మృతి చెందింది. చప్పిడి లక్ష్మీనారాయణకు చెందిన గేదె మృతి చెందడంతో ఆయన కన్నీటి పర్వంతమయ్యారు. గేదె విలువ రూ.70 వేలు ఉంటుందన్నారు. న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.