"రైతులకు ఆందోళన అవసరం లేదు "

JN: యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) అంబికా సోని మంగళవారం తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ జరుగుతోందని తెలిపారు. అవసరానికి మించి ఎరువును నిల్వచేసుకోవద్దని సూచిస్తూ, రైతులకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.