భారీ వర్షాలకు ప్రమాదకరంగా రోడ్లు

భారీ వర్షాలకు ప్రమాదకరంగా రోడ్లు

KMM: సింగరేణి మండలం గాంధీనగర్ రైల్వే గేట్ వద్ద నుంచి కొమ్ముగూడెం గాంధీనగర్ గ్రామాల మధ్య రోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలతో భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది భారీ వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించడంతో ప్రమాదాలు సంభవించే పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.