ఆటో డ్రైవర్లు నిబంధనలను పాటించాలి

ఆటో డ్రైవర్లు నిబంధనలను పాటించాలి

AKP: ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అన్నారు. శుక్రవారం నాతవరంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. అధిక లోడు, మితిమీరిన వేగం మంచిది కాదని చెప్పారు. ప్రయాణికులు పట్ల సఖ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భీమరాజు పాల్గొన్నారు.