యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలి..!
GDWL: కేటి దొడ్డి మండలంలోని పాతపాలెం గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజేందర్ రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ గురించి వివరించారు. రైతులు క్యూ లైన్‌లో వేచి ఉండకుండా యాప్ ద్వారా ముందస్తుగా యూరియా బుకింగ్ చేసుకుంటే యూరియా పొందచ్చని అన్నారు. పొలం పాస్ పుస్తకానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు.