విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించిన సందర్భంగా కనిగిరి పట్టణంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. యువతతో కలిసి జాతీయ జెండాలు ఊపుతూ భారత జట్టు విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.