వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
SDPT: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వట్టిపల్లి, మందాపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు.