ఖైదీల సంక్షేమానికి రూ.50వేల విరాళం

ఖైదీల సంక్షేమానికి రూ.50వేల విరాళం

KNR: ఖైదీల సంక్షేమానికి అండగా ఉంటామని కాంగ్రెస్ నేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఖైదీల సంక్షేమ సొసైటీ అభివృద్ధికి సోమవారం ఆయన కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ విజయ డేని, జైలర్స్ రమేష్, శ్రీనివాస్కు రూ.50,000ల విరాళం అందజేశారు. ఖైదీల సంక్షేమం పట్ల ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్న జైలు శాఖ సిబ్బందికి నరేందర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.