శ్రీశైలంలో జనవరి 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
KRNL: శ్రీశైలం క్షేత్రంలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.