మిడ్ డే మీల్స్ ఆకస్మిక తనిఖీ

చిత్తూరు నగరంలోని కస్తూరిబా బాలికల నగరపాలకోన్నత పాఠశాలలో ఎంఈవో-2 మోహన్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మిడ్ డే మీల్స్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎం రమాదేవిని అడిగి పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. అసెస్మెంట్ పుస్తకాలు, విద్యార్థుల హెల్త్ కార్డులు, టీచర్స్ హ్యాండ్ బుక్, ఉపాధ్యాయుల అటెండెన్స్ పరిశీలించారు.