పి.కోటకొండలో పర్యటించిన ఎమ్మెల్యే
KRNL: దేవనకొండ (M) పి. కోటకొండలో MLA వీరుపాక్షి ఇవాళ పర్యటించారు. తాగునీటి ఇబ్బందులు రహదారి దుస్థితి, నీటి సరఫరా లోపాలు వంటి సమస్యలను ఆయనకు గ్రామస్థులు వినిపించారు. ప్రజల సమస్యలు విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కిట్టు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.