మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
ATP: భక్త కనకదాసు జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో ఆయన విగ్రహవిష్కరణ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే బండారు శ్రావణి, నియోజకవర్గ టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కనకదాసు బోధనలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని లోకేష్ కొనియాడారు.