పురాతన వైభవం.. భక్తుల పాలిట కొంగుబంగారం
SDPT: వర్గల్‌లో 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఇక్కడ స్వామివారు అమ్మవార్లతో కలిసి 'ఏకాపీఠం'పై దర్శనమివ్వడం విశేషం. భక్తులు ఈయన్ని 'సంతాన వేణుగోపాల స్వామి'గా కొలుస్తారు. ఎత్తైన విమానరథం, ప్రశాంతమైన కోనేరు ఈ క్షేత్రానికి అదనపు ఆకర్షణలు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ పురాతన ఆలయం భక్తులతో కళకళలాడుతోంది.