జిల్లాలో పిడుగులు పడే అవకాశం: వాతావరణ శాఖ

అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేస్తూ తమ స్మార్ట్‌ఫోన్‌లకు సమాచారాన్ని పంపుతోంది. వర్షాల పట్ల ఏమైనా సమస్యలు తలెత్తితే ప్రజలు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించింది.