ఇందిరా పార్కులో అక్రమ నిర్మాణాలు.. చెక్ పెట్టిన హైడ్రా
HYD: ఇందిరా పార్కులో అక్రమ నిర్మాణాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాల జరుగుతున్నాయన్న సమాచారం మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న నిర్మాణాలను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి, నిర్మాణాలను ఆపివేశారు.