ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి: కలెక్టర్

ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి: కలెక్టర్

NTR: ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదికకు వ‌చ్చే ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గ‌డువులోగా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. మొత్తం 174 అర్జీలు వ‌చ్చాయన్నారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని కోరారు.