రేపు కొందుర్గులో రాములోరి కళ్యాణ మహోత్సవం
RR: కొందుర్గులోని స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 27న సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తారు. కళ్యాణానికి వచ్చే భక్తులు తమ వెంట వడి బియ్యం, తలంబ్రాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు తీసుకురావాలని ఆలయ కమిటీ కోరింది.