కల్లుకుంటలో భూసార పరీక్ష ఫలితాలపై అవగాహన సదస్సు
KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో రైతు సేవా కేంద్రంలో భూసార పరీక్ష ఫలితాలపై ఏవో సుచరిత ఆధ్వర్యంలో రైతులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారిణి సునీత హాజరయ్యారు. మట్టి ఆరోగ్య కార్డు ప్రాముఖ్యతను వివరించారు. మట్టి ఆరోగ్య కార్డు రైతులకు వారి పొలాల మట్టి నాణ్యత గురించి వివరించే పత్రమని తెలిపారు.