నేడు సత్యసాయి క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం
సత్యసాయి: పుట్టపర్తి ఆశ్రమం పశ్చిమ గేటు సమీపంలోని సాయి శరణ్ క్యాంపస్‌లో ఇవాళ ఉదయం శ్రీ సత్యసాయి పాలియేటివ్ కేర్ అండ్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా సత్యసాయి విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు స్థాపించిన స్వస్థ్యం సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.